మానసికస్థితి సరిగాలేని వ్యక్తి అదృశ్యం....

81பார்த்தது
మానసికస్థితి సరిగాలేని వ్యక్తి అదృశ్యం....
నార్త్ లాలాగూడ లోని ఇందిరా నగర్ కు చెందిన దాన్యకుమార్(57)కు మానసికస్థితి సరిగాలేకపోవడంతో అతని సోదరుడి ఇంట్లోనే నివాసముంటున్నాడు. గత నెల ఆగస్టు 30న ఉదయం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లిన దాన్యకుమార్ మళ్లీ ఇంటికి రాలేడు. అతని సోదరుడు శోభన్ బాబు తనకు తెలిసిన వారిని, బంధువులను వాకబు చేసిన ఫలితం లేకపోవడంతో సోమవారం లాలాగూడ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி