ప్రభుత్వం తాజాగా చేపడుతున్న సమగ్ర కుటుంబ సర్వే వల్ల ప్రజలకు మేలు జరిగితే మంచిదని, ప్రజల్లో ఉన్న అపోహలను ప్రభుత్వం నివృత్తి చేయాల్సి ఉందని సికింద్రాబాద్ ఎమ్మెల్యే తీగుళ్ళ పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో 'సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే' ప్రక్రియను తీగుల్ల పద్మారావు గౌడ్ బుధవారం సీతాఫల్ మండీ లోని టీ. ఆర్. టి. క్వార్టర్స్ లో ప్రారంభించారు.