సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడిపై దుండగుడి దాడి విషయం తెలిసిందే. కాగా ఈ ఘటనకు వెనకున్న సంచలన విషయాలు పోలీసులు వెల్లడించారు. మెట్రోపోలీస్ హోటల్లో నిర్వహించిన సమావేశంలో ప్రసంగాలకు ప్రభావితుడైన నిందితుడు దాడికి పాల్పడ్డాడని తేల్చారు. 140 మందికి పైగా అకామిడేషన్ కల్పించి, భారీ సమావేశం నిర్వహించినప్పటికీ తమకు సమాచారం ఇవ్వకపోవడంతో హోటల్ యాజమాని, మేనేజర్‌పై కేసు నమోదు చేసి, హోటల్ సీజ్ కు సిద్ధమయ్యామన్నారు.