సికింద్రాబాద్ పరిధి పార్శిగుట్ట బాపూజీ నగర్ క్రాస్ రోడ్డు వద్ద ఉన్న గణేశ్ ఫాస్ట్ ఫుడ్ అండ్ బిర్యాని పాయింట్ వద్దకు వెళ్లిన ఓ వ్యక్తి బుధవారం నూడుల్స్ ఆర్డర్ చేశాడు. తింటుండగా బల్లి రావడంతో షాక్ అయ్యాడు. యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే నిర్లక్ష్యపు సమాధానం చెప్పడంతో జిహెచ్ఎంసి కి ఫిర్యాదు చేశారు. జీహెచ్ఎంసీ తనిఖీలు చేపట్టి, హెచ్ఎంసి యాక్ట్ ప్రకారం కేసు ఫైల్ చేసింది. నిర్వాహకుడిని ట్రయల్ కోర్టుకు పంపించారు.