సికింద్రాబాద్, గుంటూరు రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలలో ఏకంగా 13 గొలుసు దొంగతనాలు చేసిన గ్యాంగ్ ను రైల్వే ప్రొటెక్షన్ పోలీసులు అరెస్టు చేసినట్లు శుక్రవారం వెల్లడించారు. ఈ గ్యాంగులో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసిన పోలీసు అధికారులు వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్ విధించారు. కేసు దర్యాప్తును మరింత వేగవంతం చేస్తున్నట్లు పేర్కొన్నారు.