సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో రైల్వే అధికారులు స్వచ్ఛతపై ప్రయాణికులకు శుక్రవారం అవగాహన కల్పిస్తున్నారు. అనేక ప్రాంతాల్లో డస్ట్ బిన్స్ ఏర్పాటు చేశామని, వాటిలో మాత్రమే చెత్త వెయ్యాలని అధికారి సురేంద్ర కుమార్ సూచించారు. ప్రత్యేక కార్డులను ప్రయాణికులకు అందజేసి, అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. అందరూ సహకరిస్తేనే స్వచ్ఛ సికింద్రాబాద్ స్టేషన్ సాధ్యమవుతుందన్నారు.