ఆనారోగ్యంతో ప్రయాణికుడు రైల్వేస్టేషన్లో మృతి చెందాడు. సికింద్రాబాద్ రైల్వే పోలీసుల కథనం ప్రకారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ప్లాట్ ఫామ్ 5 పిల్లర్ నంబరు 25 వద్ద మంగళవారం 60 ఏళ్ల వ్యక్తి ఆనారోగ్యంతో చనిపోయి ఉన్నాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహన్ని గాంధీ ఆస్పత్రి మార్చురికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.