కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న మహిళకు ఎమ్మెల్యే తలసాని అండగా నిలిచారు. మోండా డివిజన్ నాలా బజార్‌కు చెందిన లావణ్య కొద్ది రోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. వైద్యులు కిడ్నీ మార్పిడి చేయాలని సూచించారు.బీ ఆర్ఎస్ నాయకులు నాగులు సహకారంతో ఎమ్మెల్యేను కలిసి చికిత్స కోసం సహకారాన్ని అందించాలని కోరారు. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన రూ. 2లక్షల ఎల్ఓసిని ఎమ్మెల్యే ఆమె భర్త సంపత్ కు అందజేశారు.