గాంధీ ఆసుపత్రి ఆవరణలో మరో గుర్తు తెలియని డెడ్ బాడీ లభ్యమైంది. సోమవారం చిలకలగూడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాంధీ వెయిటింగ్ హాలులో పడి ఉన్న దాదాపు 30 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తి డెడ్ బాడీని సెక్యూరిటీ సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడ ఎలాంటి వివరాలు లభించకపోవడంతో డెడ్ బాడీని మార్చురీకి తరలించి భద్రపరిచారు. ఫోటోలో వ్యక్తిని గుర్తు పట్టిన వారు పిఎస్ లో సంప్రదించాలని పోలీసులు కోరారు.