ఉత్తర భారతీయులు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించుకునే ఛట్ పూజ వేడుకలు హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. హుస్సేన్ సాగర్ వద్ద ఉన్న బతుకమ్మ ఘాటుకు పెద్ద ఎత్తున మహిళలు తరలి వచ్చారు. మోకాలి లోతు నీటిలో నిలబడి సూర్య దేవునికి ఆర్ఘ్య ప్రసాదాలను సమర్పించారు. గురువారం నగరంలోని మొత్తం 50 ప్రాంతాల్లో ఈ వేడుకలను నిర్వహించారు.