సమగ్ర కుటుంబ సర్వేకు ప్రజలు సహకరించాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. శనివారం బేగంపేట్‌లోని మయూరి మార్గోలో కొనసాగుతున్న సర్వేను కలెక్టర్ పరిశీలించారు. డిప్యూటీ కమిషనర్ సోమయ్య, ఎన్యుమరేటర్లతో మాట్లాడి ఆరా తీశారు. కుటుంబ సభ్యుల వివరాలను పకడ్బందీగా నమోదు చేయాలన్నారు. అన్ని వివరాలు అందించి ఎన్యుమరేటర్లకు సహకరించాలని ప్రజలను కలెక్టర్ కోరారు.