చిలకలగూడ పీఎస్ పరిధిలో రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆలుగడ్డ బావి జంక్షన్ రైల్వే సబ్‌వే వద్ద బుధవారం ఉదయం 3 గంటలకు షిఫ్ట్ కారు ఓ వ్యక్తి (30)ని ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అంబులెన్స్ సిబ్బంది వచ్చి చనిపోయినట్లు డిక్లేర్ చేశారు. మృతుడి కోసం తమని సంప్రదించాలని కోరారు.