సీతాఫల్ మండిలో దశలవారీగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని బీఆర్ఎస్ కార్పొరేటర్ సామల హేమ అన్నారు. బుధవారం డివిజన్ పరిధి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల వద్ద స్ట్రామ్ వాటర్ లైన్ పనులు, మార్కండేయ నగర్ లో రోడ్డు పనులను కార్పొరేటర్ ప్రారంభించారు. మొత్తం రూ. 35 లక్షలతో పనులను చేపడుతున్నట్టు తెలిపారు. బీఆర్ఎస్ హయాంలోనే నిధులు మంజూరయ్యాయని వెల్లడించారు.