సీతాఫల్ మండి డివిజన్ పరిధిలోని ఇందిరా నగర్ లో స్థానిక డివిజన్ కార్పొరేటర్ సామల హేమ శనివారం పర్యటించారు. ఇందిరా నగర్ రోడ్ నంబర్ 9 మీన బేకరి గల్లీలో నిరంతరంగా డ్రైనేజీ లైన్ పొంగుతుందని స్థానికులు కార్పొరేటర్ దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన కార్పొరేటర్ వెంటనే సమస్యను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. శాశ్వత పరిష్కారం కోసం నూతన పైప్ లైన్ కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు.