ప్రతి ఒక్కరూ విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఏసీపీ శంకర్ రాజు అన్నారు. రోడ్డు భద్రతపై శుక్రవారం జేబీఎస్ లో ఆర్టీసీ డ్రైవర్లకు, రోడ్డు ప్రమాదాలు.. వాటి నివారణ అనే అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కలిగించారు. ఒక బస్సులో సుమారు 40 నుంచి 50 మంది ప్రయాణికుల ప్రాణాలు ఒక డ్రైవర్ చేతిలోనే ఉంటాయి కాబట్టి డ్రైవర్ ఎల్లప్పుడూ జాగ్రత్తగా బస్సును నడపాలని ఏసీపీ శంకర్ రాజు తెలిపారు.