సికింద్రాబాద్ కుమ్మరి బస్తిలోని ముత్యాలమ్మ ఆలయంపై జరిగిన దాడిని తెలుసుకొని కార్పొరేటర్ సామల హేమ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ దాడికి పాల్పడినవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దేవత విగ్రహాలను ధ్వంసం చేయడం సమాజానికి మంచిది కాదు అని, మత విద్వేషాలు రెచ్చగొట్టే వారినీ ఎంతటి వారినైనా ఉపేక్షించకూడదు అని ప్రభుత్వాన్ని కోరారు. ఇలాంటి ఘటనలు భక్తుల మనోభావాలు దెబ్బతీయడమే అవుతుందని అన్నారు.