నగరంలో ప్రసిద్ధి చెందిన రసూలురాలోని స్వామి నారాయణ ఆలయంలో శనివారం గుజరాత్ సమాజం ఆధ్వర్యంలో అన్నకూట మహోత్సవం నిర్వహించారు. స్వామి నారాయణునికి వెయ్యి రకాల ఆహార పదార్థాలను నైవేద్యంగా సమర్పించారు. కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, మల్కాజ్గరి ఎంపీ ఈటల రాజేందర్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేశ్‌లు హాజరై ఈ అన్నకూట మహోత్సవం, హారతి, భజన కార్యక్రమంలో పాల్గొన్నారు.