హైదరాబాద్‌లో డీసీఏ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఇందులో భాగంగా సికింద్రాబాద్ సీతాఫల్మండిలోని ఓ మెడికల్ షాపులో తనిఖీ చేసి పలు మందులు సీజ్ చేశారు. ఈ తనిఖీల్లో 45 రకాల దాదాపు రూ. 1. 25 లక్షల విలువ చేసే మందులు సీజ్ చేశారు. ఎక్స్పైరీ మందులు, అబార్షన్ మెడిసిన్ అనధికారికంగా విక్రయిస్తున్నారని అధికారులు వెల్లడించారు.