బౌద్ధనగర్లోని పలు ప్రాంతాల్లో శుక్రవారం స్థానిక కార్పొరేటర్, జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యురాలు కంది శైలజ శ్రీకాంత్, ఏఈ కౌశిక్, లావణ్య వివిధ అధికారులతో కలిసి నాలా పనులను పరిశీలించారు. ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా పనులను వేగవంతం చేయాలని సూచించారు. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని స్పష్టం చేశారు.