జిహెచ్ఎంసి ఎంటమాలజీ బృందం ఆధ్వర్యంలో అల్వాల్ పరిధిలో ప్రతి ఇంటింటికీ యాంటీ లార్వా ఆపరేషన్ చర్యలు చేపట్టారు. చర్యల్లో భాగంగా క్రిమిసంహారక రసాయనాలను పిచికారీ చేయడంతో పాటు, ఇంటి పరిసరాలలో నిల్వ ఉన్న నీటిని తొలగించినట్లుగా తెలిపారు. దోమల బెడదను నివారించేందుకు ప్రజలు నీరు నిల్వ ఉంచకుండా చూసుకోవాలని, రాత్రి సమయంలో దోమతెరలు వాడాలని సూచించారు.