కుత్బుల్లాపూర్ నియోజక వర్గం మైసమ్మగూడలోని రాత్రి కురిసిన భారీ వర్షానికి మైసమ్మగూడ నీట మునిగింది. మైసమ్మగూడ చెరువు నాలా ఆక్రమణకు గురికావడంతో నాలా నుండి పారాల్సిన వరద నీరు రోడ్లపై పారడంతో పలు హాస్టళ్లు, సెల్లార్లలోకి, ఇళ్లలోకి వర్షపు నీరు అడుగుమేర బుధవారం చేరింది. దీంతో మల్లారెడ్డి యూనివర్సిటీ విద్యార్థులు, స్థానిక ప్రజలు రాత్రంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.