కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 7వ డివిజన్ ఎన్టీఆర్ నగర్ కాలనీ వాసుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఛట్ పూజలో ముఖ్య అతిధిగా డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ పాల్గొని ప్రత్యేక పూజలు శుక్రవారం నిర్వహించారు. డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, చండీగఢ్, గుజరాత్, ముంబై తదితర ప్రాంతాల్లో ప్రముఖంగా కార్తీకమాసంలో జరుపుకునే పండుగ అన్నారు.