రోడ్డు పక్కన ఫుట్ పాత్ ల పైన వెలసిన అక్రమ ఇసుక, కంకర దుకాణాలతో నానా ఇబ్బందులు పడుతున్నామని శుక్రవారం స్థానికులు తెలిపారు. ముషీరాబాద్ ఎక్స్ రోడ్ తో పాటు గాంధీ ఆస్పత్రి వెనుక ఫుట్ పాత్ లను ఆక్రమించుకున్న కొందరు కొంతకాలంగా ఇసుక, కంకర వ్యాపారం యథేచ్ఛగా సాగిస్తున్నారన్నారు. జీహెచ్ఎంసీ అధికారులు చూస్తున్నప్పటికీ పట్టించుకోవడంలేదని, వారి నుంచి ముడుపులు తీసుకొని వదిలేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.