సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి ఆవరణలో మరో గుర్తు తెలియన్ డెడ్‌బాడీ మంగళవారం లభ్యమైంది. ఎమర్జెన్సీ బ్లాక్ ఎదురుగా వేటింగ్ హాల్లో పడి ఉన్న గుర్తుతెలియని ( సుమారు 40-45) వయసు కలిగిన వ్యక్తి డెడ్‌బాడీని సెక్యూరిటీ సిబ్బంది గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎలాంటి వివరాలు లభించకపోవడంతో పోలీసులు మార్చురి తరలించారు. వ్యక్తిని గుర్తుపట్టిన వారు పీఎస్‌లో సంప్రదించాలని కోరారు.