ఎన్నోరోజుల నుండి వేచి చూసిన బోడుప్పల్ కార్పొరేషన్ ప్రజానీకం చిరకాల కోరిక తీరనుంది. 40 అడుగుల సీసీ రోడ్డు నిర్మాణం పనులకు సుమారుగా రెండు కోట్ల వ్యయంతో తెలంగాణ ప్రభుత్వ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT), ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, పరిశ్రమ & వాణిజ్యం మరియు శాసనసభా వ్యవహారాల మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు చేతుల మీదుగా శుక్రవారం శంకుస్థాపన చేసారు. ఈ కార్యక్రమానికి స్థానికులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.