మల్కాజిగిరి డివిజన్ కార్పొరేటర్ శ్రవణ్ శనివారం డివిజన్ పరిధి విష్ణుపురి కాలనీలో వాటర్ వర్క్స్ అధికారులతో కలిసి పర్యటించారు. వాటర్ ప్రెషర్ సమస్యను పరిష్కరించాలని అధికారులకు సూచించారు. అదే విధంగా నాలా నుంచి తీసిన సిల్ట్ ను రోడ్లపై వదిలి వేయకుండా తొలగించాలన్నారు. ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ మేనేజర్ నవీన్, రవి, మాజీ కౌన్సిలర్ విజయ్ కుమార్, రాజేశ్, తదితరులు పాల్గొన్నారు.