అమీర్‌పేట, పంజాగుట్ట, నాగార్జున సర్కిల్, నాంపల్లి, ఆసీఫ్‌నగర్, జియాగూడ, బేగంపేట, బ్రాహ్మణవాడ లాంటి అనేక ప్రాంతాల్లో మురుగునీటి సమస్య ఉందని జిహెచ్ఎంసి, జలమండలి అధికారులు గుర్తించారు. మురుగునీటి సమస్య పరిష్కరించే సమయంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక టెక్నాలజీని ఉపయోగించనున్నట్లుగా వెల్లడించారు. త్వరలోనే ట్రెంచ్ లెస్ విధానం అందుబాటులోకి రానుంది.