బాలానగర్ డివిజన్లోని నర్సాపూర్ చౌరస్తా చిత్తారమ్మ బస్తీ డబుల్ బెడ్రూమ్స్ వద్ద అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి బుధవారం శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. చిత్తారమ్మ బస్తీ రూమ్ రెసిడెన్సీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. జాతీయ దళిత స్త్రీ శక్తి కన్వీనర్, హైకోర్టు లాయర్ గడ్డం ఝాన్సీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అంబేడ్కర్ ఆశయ సాధన కోసం కృషి చేయాలని కోరారు.