గ్రేటర్ హైదరాబాద్ లో సకుటుంబ సర్వేకు రంగం సిద్ధమైంది. ఈ సర్వేలో గ్రేటర్ వ్యాప్తంగా 21 వేల ఎన్యుమరేటర్లు, రిసోర్స్ పర్సన్లు, సూపర్ వైజర్లు పాల్గొంటారని మున్సిపల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్ శనివారం తెలిపారు. బంజారాహిల్స్ గౌరీ శంకర్ కమ్యూనిటీ హాల్లో జరిగిన ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఆయన పాల్గొన్నారు. ఈ నెల 6 నుంచి సర్వే ప్రారంభం అవుతుందని తెలిపారు.