షేక్ పేట్: సీవరేజ్ లైన్ పనులను పరిశీలించిన కార్పొరేటర్
సీవరేజ్ లైన్ పనులతో మురుగు నీటి సమస్యకు చెక్ పెట్టవచ్చని షేక్ పేట్ డివిజన్ ఎంఐఎం కార్పొరేటర్ మహ్మద్ రషీద్ అన్నారు. సోమవారం డివిజన్ పరిధిలోని గోల్డెన్ సాండ్ కాలనీలో కార్పొరేటర్ పర్యటించారు. స్థానికంగా కొనసాగుతున్న సీవరేజ్ లైన్ పనులను పరిశీలించారు. పనుల పురోగతిపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. పనులు వేగవంతం చేయాలని, నాణ్యత ప్రమాణాలు తప్పకుండా పాటించాలని సిబ్బందికి ఎమ్మెల్యే సూచించారు.