రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను బీజేపీ ఎంపీలు ఈటెల రాజేందర్, రఘునందన్ రావు, కొండ విశ్వేశ్వర్ రెడ్డి సోమవారం కలిశారు. ఇటీవల జరిగిన ముత్యాలమ్మ ఆలయ ఘటనపై గవర్నర్ కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అనంతరం ఈటెల రాజేందర్ మాట్లాడుతూ. ఈ కేసును ఎన్ఐఏ కు అప్పగించాలని గవర్నర్ ను కోరామన్నారు. అలాగే శాంతియుతంగా నిరసన చేపట్టిన హిందువులపై లాఠీచార్జీ చేయడాన్ని తీవ్రంగా పరిగణించాలని కోరినట్లు తెలిపారు.