సీఎం రేవంత్ రెడ్డి సెక్యూరిటీలో కీలక మార్పు
సీఎం రేవంత్ రెడ్డి సెక్యూరిటిలో ఉన్నతాధికారులు కీలక మార్పులు చేశారు. సీఎం నివాసం వద్ద ఆర్మ్ రిజర్వ్ పోలీసులతో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్ర స్పెషల్ పోలీసులు (టీజీఎస్పీ) నిరసనలు చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి నిరసన తెలిపిన పోలీసులను ఇప్పటికే అధికారులు సస్పెండ్ చేశారు.