ఏపీలో మద్యం షాపుల నిర్వాహకులకు సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బెల్ట్ షాపులను అనుమతించొద్దు అన్నారు. బెల్ట్ షాపులకు మద్యం విక్రయించే లిక్కర్ షాపులకు రూ.5 లక్షలు ఫైన్ విధిస్తామని హెచ్చరించారు. రెండో సారి నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు చేస్తామని, MRP కంటే ఒక్క రూపాయి ఎక్కువ అమ్మినా ఊరుకునేది లేదన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే మద్యంపై నిఘా పెట్టాలని అధికారులను ఆదేశించారు.