ఇటీవలే తన కూతురు గాయత్రి ఆకస్మిక మరణంతో నటుడు రాజేంద్రప్రసాద్ తీవ్ర శోకసంద్రంలో ఉన్నారు. ఈ మేరకు ఆయనను పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పరామర్శిస్తున్నారు. సోమవారం రాజేంద్రప్రసాద్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. హైదరాబాద్లోని రాజేంద్రప్రసాద్ నివాసానికి వెళ్లిన కేటీఆర్ గాయత్రి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించి. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.