హనుమకొండలోని నక్కలగుట్ట ప్రాంతానికి చెందిన శోభలత అనే వృద్ధురాలు కంటి పరీక్షల కోసం ఎల్వీ ప్రసాద్ హాస్పిటల్కు తన సోదరితో కలిసి వెళ్ళింది. చికిత్స అనంతరం ఎన్జీఆర్ఐ స్టేషన్లో మెట్రో దిగి అక్కడినుంచి బస్సులో హన్మకొండకు వెళ్లిపోయింది. ఇంటికి వెళ్లిన శోభలత బ్యాగు చూసుకోగా రూ.12వేల నగదు, చెవికమ్మలు మాయమైయ్యాయి. బాధితురాలు ఫిర్యాదు మేరకు మంగళవారం జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.