హైదరాబాద్ లోని నాగోల్ మెట్రోతో పాటు అన్ని మెట్రో స్టేషన్ల వద్ద ఉచిత పార్కింగ్ ను కొనసాగించాలని PYL, AIYF, AISF సంఘాలు డిమాండ్ చేశాయి. పార్కింగ్ ఫీజు వసూలు చేయాలని మెట్రో తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద సలు సంఘాల నేతలు ధర్నా నిర్వహించారు. మెట్రో నిర్ణయం వెనక్కి తీసుకోవాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.