చార్మినార్: జోనల్ కమిషనర్ ను కలిసిన ఎమ్మెల్సీ

69பார்த்தது
చార్మినార్: జోనల్ కమిషనర్ ను కలిసిన ఎమ్మెల్సీ
అభివృద్ది పనులపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రేహ్మత్ బేగ్ అన్నారు. మంగళవారం చార్మినార్ జోనల్ కమిషనర్ వెంకన్నను ఎమ్మెల్సీ తన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. చార్మినార్ పరిధిలో ఉన్న అభివృద్ది పనులపై సమీక్ష నిర్వహించారు. అభివృద్ది పనులు సకాలంలో పూర్తి అయ్యేలా కాంట్రాక్టర్లకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఇక్కడ నాణ్యత లోపించకుండా పనులు జరిగేలా ప్రత్యేకంగా ఆదేశాలు ఇవ్వాలన్నారు.

தொடர்புடைய செய்தி