టీజీఎస్పీడిసీఎల్ ఎండీ ముషారఫ్ ఆలీ ఫరూక్ ను ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రేహ్మత్ బెగ్ శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా బహదూర్ పురా లోని పెండింగ్ అభివృద్ది పనులపై చర్చించారు. ఇటీవల మంజూరైన అభివృద్ది పనులను సకాలంలో ప్రారంభించి పూర్తి చేయాలని కోరారు. అలాగే అవసరం ఉన్న ప్రాంతాల్లో ట్రాన్స్ పార్మార్లు, విద్యుత్ స్తంభాలు, విధి దీపాలు ఏర్పాటు చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.