పార్టీలకు అతీతంగా రాష్ట్రాన్ని అభివృద్ది చేసుకునే అవకాశం ఉందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఆదివారం నాంపల్లిలో అలయ్ బలయ్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో పార్టీలు ఎన్నో ఉన్నాయని ఒక్కొక్కరు ఒకప్పుడు అధికారంలోకి వస్తారన్నారు. రాష్ట్ర అభివృద్దే ధ్యేయంగా ముందుకు వెళ్ళల్సినపుడు అందరు కలిసి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.