ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి, సమాజ్ వాది పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నేతాజీ ములాయం సింగ్ యాదవ్ మరణం యావత్ యాదవ లోకానికి తీరనిలోటు అని వారి మృతికి అఖిల భారత యాదవ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మణ్ యాదవ్ సంతాపం తెలియచేశారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ యాదవ్ మాట్లాడుతూ... 3 సార్లు ముఖ్యమంత్రిగా, 9 సార్లు ఎమ్మెల్యేగా, 7 సార్లు ఎంపీ గా, కేంద్ర మంత్రిగా, అరవై యేండ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవమున్న గొప్ప రాజకీయ దురంధుడు, మండల్ యోధుడు, బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి నేతాజీ ఇకలేరు అని తెలుపుటకు చాలా బాధాకరం అని అన్నారు.
నేతాజీ కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో అఖిల భారత యాదవ మహాసభ జాతీయ కార్యాలయం కొరకు ఢిల్లీకి సమీపంలోని గజియబాద్ లో శ్రీ కృష్ణ భవన్ కొరకు స్థలము కేటాయించడంమే కాక భావన నిర్మాణం కొరకు కొంత నిధులను మంజూరు చేయించారు అని వారు గుర్తు చేశారు. గత మూడు దశాబ్దాల పాటు వ్యక్తిగత పరిచయంలో ఎప్పుడు పోయిన కూడా ఆప్యాయంగా పలకరించేవారు అని తెలిపారు. నేతాజీ మరణం యావత్ దేశానికే కాక అఖిల భారత యాదవ మహాసభకు తీరనిలోటు అని లక్ష్మణ్ యాదవ్ ఒక ప్రకటన లో తెలిపారు.
ఆర్ లక్ష్మణ్ యాదవ్ తో పాటు అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు బద్దుల బాబు రావు యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్ సి రవీందర్ యాదవ్, ఉపాధ్యక్షులు ఎం బాలమల్లేష్ యాదవ్, ఎం రాజేందర్ యాదవ్, ప్రధాన కార్యదర్శులు వంగ మల్లేష్ యాదవ్, పోచబోయిన శ్రీహరి యాదవ్, కోశాధికారి దారబోయిన శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు రాగం సుజాత యాదవ్, యువజన అధ్యక్షులు ఐలబోయిన రమేష్ యాదవ్, జాతీయ యువజన కోఆర్డినేటర్ గొర్ల యశ్వంత్ రాజ్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు మైల్కొల్ మహేందర్ యాదవ్, రాష్ట్ర యువజన కార్యదర్శి యేషాం మల్లేష్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ యువజన అధ్యక్షులు ఎం విజయ్ యాదవ్ సంతాపం వ్యక్తం చేశారు.