అంబర్‌పేటలోని మహంకాళి ఆలయంలో ఓ వ్యక్తం మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు. ఎం. మహేష్ అనే వ్యక్తి రాత్రి ఆలయం మూసి వేసిన సమయంలో మద్యం మత్తులో దర్శనానికి వచ్చాడు. అతడిని ఆలయ సెక్యూరిటీ అనుమతించకపోవడంతో రాళ్లతో సెక్యూరిటీ గార్‌పై దాడి చేశాడు. ఆలయ కమిటీ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకొని వ్యక్తిని అంబర్‌పేట పోలీసులకు అప్పగించారు.