బ్యాచిలర్ ఆఫ్ కామర్స్(బీకాం) పూర్తి చేసిన విద్యార్థులు సాఫ్ట్‌వేర్ నైపుణ్యాలు సొంతం చేసుకుంటే.. కంపెనీల్లో అకౌంట్ ఎగ్జిక్యూటివ్ స్థాయిలో స్థిరపడేందుకు అవకాశం ఉంటుంది. ట్యాలీ, వింగ్స్, ఫోకస్ వంటి అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్స్‌ను బీకాం విద్యార్థులు నేర్చుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈఆర్‌పీ సొల్యూషన్స్‌గా పేర్కొనే శాప్ వంటి కోర్సులు పూర్తి చేసుకుంటే ఐటీ రంగంలో కొలువు దక్కించుకోవచ్చని తెలుపుతున్నారు.