తెలంగాణలో పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డ ఎమ్మెల్యేల కేసుపై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కౌంటర్ దాఖలు చేయడానికి మరింత సమయం కావాలని ప్రతివాదులు కోరారు. వారిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫిర్యాదు వచ్చి ఎన్ని రోజులు అవుతుందో తెలుసా అని ప్రశ్నించింది. 'మీకు ఎంతసమయం కావాలి... MLAల పదవి కాలం ముగిసే వరకా?' అని ఆగ్రహం వ్యక్తం చేసింది. కాలయాపన చేసే విధానాలు మానుకోవాలని హెచ్చరించింది.