పూర్వం రాజులు రాజ్యాలను గెలవడానికి, ఏదైనా పోటీలను గెలవడానికి యుద్ధాలు చేసేవారు. కానీ అన్ని సందర్భాలలో యుద్ధం అవసరం కాదు. ఒకవేళ యుద్ధమే చేస్తే.. అపార ప్రాణనష్టం జరుగుతుంది. అందువల్ల కొన్ని సందర్భాల్లో మనుషులతో యుద్దానికి బదులు.. ఇరువైపులా రెండు కోళ్లతో పందెం నిర్వహించేవారు. ఇందులో ఏ కోడి గెలిస్తే.. ఆ పక్షం వారు గెలుపొందినట్లు భావించేవారు. ప్రాణనష్టాన్ని నివారించడానికి అప్పట్లో ఎంచుకున్న మార్గం కోడిపందేలు అని చెప్పచ్చు.