రైతు భరోసాపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలని రైతులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. 'ప్రతి ఎకరానికి ఏడాదికి రూ.15వేలు ఇస్తామని సీఎం రేవంత్ అన్నారు. ఇప్పటికే రెండు పంట సీజన్లు అయిపోయాయి. మూడో సీజన్ కూడా వచ్చేసింది. ఒక్కో రైతుకు ఒక్కో ఎకరానికి రూ.17,500 ప్రభుత్వం బాకీ పడింది. ఆంక్షలు విధించి లక్షలాది మందికి రైతు భరోసా ఎగ్గొట్టాలని చూస్తున్నారు' అని రాసుకొచ్చారు.