HYD: హెచ్ఎండిఏ పరిధిలో చెరువుల ఆక్రమణ, FTL నిర్ధారణపై సుమోటో పిటిషన్ ను హైకోర్టు విచారించింది. HMDA పరిధిలోని 3,532 చెరువుల FTL నోటిఫికేషన్ సంబంధించి ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు. ఇప్పటివరకు 700కు పైగా చెరువులకు తుది నోటిఫికేషన్ జారీ చేశామని, మిగతా చెరువుల తుది నోటిఫికేషన్ కు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతొందని తెలిపారు. వాదనలు విన్న HC.. తదుపరి విచారణ వచ్చే నెలకు వాయిదా వేశారు.