యాదాద్రి, మెదక్, మహేశ్వరం, కుత్బుల్లాపూర్ మెడికల్ కాలేజీలకు కేంద్ర ఆరోగ్య శాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం దరఖాస్తు చేసిన నాలుగు కాలేజీలకు పర్మిషన్ ఇవ్వాలని నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ)ను ఆదేశించింది. ఇదే విషయాన్ని తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం లేఖ పంపింది. ఒక్కో కాలేజీలో 50 ఎంబీబీఎస్ సీట్ల చొప్పున, మొత్తం 200 సీట్లు అందుబాటులోకి రానున్నాయి.