ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని పెంచేందుకు రూ.10,900 కోట్లతో 'పీఎం ఈ-డ్రైవ్' పథకానికి కేంద్రం ఆమోద ముద్ర వేసింది. ఈ పీఎం ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్‌హాన్స్‌మెంట్ పథకానికి ప్రభుత్వం రెండేళ్లలో ఈ మేర ఖర్చు చేయనుంది. ఇది ఎలక్ట్రిక్ బైక్ లు, ఎలక్ట్రిక్ త్రీ వీలర్లు, ఈ-అంబులెన్స్ లు, ఈ-ట్రక్కులతో పాటు ఇతర ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు సబ్సిడీ ప్రోత్సాహకాయలను అందిస్తుంది.