కొత్త సంవత్సరం-2025లో బంగారం ధరలు రికార్డు గరిష్టాలకు చేరుకుంటుందని నిపుణుల అంచనా వేస్తున్నారు. యుద్ధాలు, జియో పాలిటికల్ టెన్షన్స్, ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెంపు కొనసాగితే 10 గ్రాముల ధర రూ. 90,000 ధరను తాకుతుందని చెబుతున్నారు. కనీసం రూ.85వేలను అందుకోవచ్చని విశ్లేషణ చేస్తున్నారు. ఇక కిలో వెండి రూ.1.10 లక్షలు, దూకుడు కొనసాగితే రూ.1.25 లక్షలకు చేరుకోవచ్చని చెప్తున్నారు. అనిశ్చితి, యుద్ధాలు లేకుంటే బలహీనత కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు.