AP: అమెజాన్ గిఫ్ట్ కార్డ్ ఓచర్స్ విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి స్పందించారు. 'గిఫ్ట్ కార్డుల్లో డబ్బు జమ చేయడం సులభం. అయితే కాలపరిమితి ముగిసిన కార్డుల నుంచి డబ్బు వెనక్కి తీసుకోవడం కష్టమైన ప్రక్రియ. ఇది సులభతరంగా ఉండాలి. గిఫ్ట్ కార్డులో బ్యాలెన్స్ ఆటోమేటిక్‌గా మెయిన్ ఖాతాలోకి బదిలీ కావాలి. ఈ విధానంపై అమెజాన్ ఆలోచించాలని కోరుతున్నా.' అని ట్వీట్ చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రిని, RBIని ట్యాగ్ చేశారు.